గడువు పెంపు
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి పాడి గేదెలు పెంపకం పథకానికి మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచినట్లు జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ లేదా ఆహార భద్రతా కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల భూమి కలిగి ఉండాలన్నారు. అర్హులు ఈ నెల 23వ తేదీలోపు ఆన్ లైన్ వెబ్ సైట్ (https://tgobmms.cgg.gov.in ) లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు పత్రాలను మండలం లేదా మున్సిపాలిటీలో అందజేయాలని ఆయన కోరారు.






