2 July, 2026 | 5:59 PM

ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు

02-07-2026 04:56 PM

నాగిరెడ్డిపేట్ జులై 2 (విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో గల శ్రీమరకత ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ నిర్మాణంకు సుమారు 20 లక్షల నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావును శాలువాతో సన్మానించి కోరారు. దీనికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్థానికులంగా స్పందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గడ్డం బాల్రెడ్డి,రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,నరేందర్ రెడ్డి, రామా గౌడ్,నారాయణరెడ్డి, నర్సింలు,మధు,తదితరులు పాల్గొన్నారు.