విజేతలకు బహుమతులు
15-06-2026 03:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో నిర్వహించిన 40వ వార్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న విజేతలకు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి బహుమతులను అందించారు. మాట్లాడుతూ క్రీడల్లో యువత చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ, విజేతలు మరియు రన్నరప్ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, రాఘవేంద్ర చారి, ఆడప పోశెట్టి, నాయకులు ఆడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






