18-02-2026 09:07:11 PM
సిర్పూర్(యు),(విజయక్రాంతి): మండలంలోని మహాదేవ్ జాత్రలో రెండు రోజులుగా కొన్నసాగుతున్న కబాడీ పోటిల్లో బుధవారం విజేతలైన క్రీడాకారులకు నగదు బహుమతులు అందజేసిన మార్కెట్ చైర్మన్ కూడ్మేత విశ్వనాధ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఏలుగా కొనసాగుతున్న మహాదేవ్ జాతర సందర్బంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబాడీ పోటీలో మొదటి బహుమతి లింగాపూర్ మండలం జారుగుడా కబాడీ జట్టుకి రూ. లు 12551, రెండవా బహుమతి గెలుపొందిన చింతకర్ర జట్టు కి రూ. లు 7001 నగదు బహుమతి అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ ఆత్రం దౌలత్ రావు, జైన్నూర్ సింగల్ విండో చైర్మన్ కొడప హన్ను పట్టేల్, సర్పంచులు ఆత్రం ఓమ్ ప్రకాష్,పెందోర్ గణపత్, కుంరం భీంరావ్, కొడప ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆత్రం గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.