దుబాయ్ వెళ్లొదన్నందుకు పురుగుల మందు సేవించి ఆత్మహత్య
బోధన్,జూలై 7(విజయ క్రాంతి): నవీపేట్ మండలం నందిగామ్ గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రవీణ్ కుమార్ 21 అనే యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రవీణ్ ను దుబాయ్ వెళ్ళొద్దాన్ని గతంలో రెండు సార్లు దుబాయ్ వెళ్లి తిరిగి వచ్చిందుకు అప్పులు అధికామాయ్యాయని పేర్కొన్నారు.
గత అనుభవలను దృష్టిలో పెట్టుకుని దుబాయ్ కి ప్రవీణ్ ను వెళ్ళద్దని అడ్డు చెప్పడం తో మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మ హత్యకు పాల్పడడ్డం తో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు నవీపేట్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వివరించారు.






