8 August, 2026 | 3:58 AM

బంగారు భవిష్యత్తుకు పునాది ప్రైమరీ విద్య

08-08-2026 01:29 AM

పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ

కూకట్‌పల్లి, ఆగస్టు 7 (విజయక్రాంతి): బంగారు భవిష్యత్తుకు పునాది లాంటిది ప్రాథమిక విద్య అని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఎల్లమ్మ బండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సి ఎస్ ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన రెండు అదనపు తరగతి గదుల భవనాన్ని శుక్రవారం అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎంఈఓ రవీందర్ రాజు, మాజీ కార్పొరేటర్ లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సభ్యురాలు నాగలక్ష్మి, జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధా పద్మజ, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.