1 April, 2026 | 1:38 AM

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

01-04-2026 12:07 AM

- మెదక్ జిల్లా ఎస్ పి శ్రీనివాస్ రావు 

- జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపడతాం

- చేగుంటలో నేత్ర వైద్య శిబిరం ప్రారంభం

చేగుంట, మార్చి 31: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్నివైపుల నుంచి చర్యలు తీసుకుంటున్నామని మెదక్ ఎస్ పి శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం చేగుంట పోలీసుల ఆద్వ ర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లాఎస్ పి శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ.. నిర్లక్ష్యపూ డ్రైవింగ్ వల్లనే వేలమంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నారన్నారు.

ప్రతిరోజు, ప్రతి గంటకు వందల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వాపో యారు. కంటి చూపు లోపం కూడా రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా గుర్తించి ఆటోడ్రైవర్లకు నేత్ర వైద్యo కోసం కంటి పరీక్షలు చేపిస్తున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడిపితే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రజల్ని క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యతను వారెప్పుడూ విస్మరించకూడదని గుర్తు చేశారు. అటు ప్రయాణికుల, ఇటు తమ కుటుంబ సభ్యులు జీవితాలు ఆటో డ్రైవర్లపైనే ఆధారపడి ఉందన్నారు.

ప్రతి ఆటో డ్రైవర్ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలనన్నారు. వారం రోజుల్లోనూ ప్రతి వాహనదారుడు సంబంధిత వాహన పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఆ తరువాత జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ , చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి,లైన్స్ క్లబ్ ప్రతినిధులు శంబుని శ్రీనివాస్,ఆకుల సుకెందర్, నాగరాజు పాల్గొన్నారు.