నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల బహుకరణ
పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్, పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో ట్యాలీ, డీటీపీ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యోగ్యత పత్రాలను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిలుగా నవలిమిటెడ్ వ్యవస్థాపకులు డా. దేవినేని సుబ్బారావు, పాండ పున్నయ్య కుటుంబ సభ్యులు శారద, రాజేశ్వరి, జ్యోష్న, శ సునీత, పి. రాజేశ్వరి, నీలిమ, జయశ్రీ, రాణి, రమా దేవినేని హాజరయ్యారు.
ఈ సందర్బంగా డీటీపీ కోర్సులో శిక్షణ తీసుకున్న సి. హెచ్. చిద్విలాసిని మాట్లాడుతూ మహిళా సాధికార కేంద్రం తమ లాంటి వారికి ఎందరికో ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.తను ఈ శిక్షణ అనంతరం హెచ్ ఎఫ్ సి ఎల్ లో నెలకు రూ12000 వేతనంతో ఎంపిక అయ్యారని తెలిపారు. అతిధుల చేతులమీదుగా ట్యాలీ, డీటీపీ యోగ్యత పత్రాలు అందచేసారు. అతిధి జ్యోష్న మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగ ఏదగడానికి నవ కృషి చేస్తుందని, మహిళలు ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగిoచుకొని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు.
అనంతరం ఎమ్. శ్రీనివాసరావు, మహిళా సాధికార కేంద్ర ప్రతినిధి మాట్లాడుతూ 1975 లో నవభారత్ సంస్థ ప్రారంభించిన నాటి నుండి సంస్థ అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులకు ఆనాడే శ్రీకారం చుట్టింది అని తెలిపారు.అందుకు ఉదాహరణ నవభారత్ ఉన్నత పాఠశాలలో సుమారు 10,000 పైగా విద్యార్థులు ఉచిత విద్య అందుకున్నారని, 2010 నుండి హెల్ప్ అనే కార్యక్రమం ద్వారా ఇక్కడి ప్రజలకు మరింత చేరువయింది.
దానిలో భాగంగా నవభారత్ కంటి వైద్య శాల నందు పది లక్షలుకు పైగా వైద్యాన్ని 55,000 మందికి పైగా కంటిశస్త్ర చికిత్స లను అందించామని అలాగే ' 29'గ్రామాలలో సురక్షిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశామని మరియు ఈ మహిళా సాధికార కేంద్రంలో ఇప్పటివరకు 4600 మందికి పైగా వివిధ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్ శ్రీనివాసరావు సి. ఎస్ ఆర్ మేనేజర్,టి. అరుణ, దివ్య, శిరీష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




