31 March, 2026 | 5:22 AM

డిగ్రీ కళాశాలలో విత్తన బంతుల తయారీ

31-03-2026 12:00 AM

కాగజ్‌నగర్, మార్చి ౩౦ (విజయ క్రాంతి):  కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం, ఎకోక్లబ్ ఆధ్వ ర్యంలో సోమవారం విద్యార్థుల చేత విత్తనపు బంతులు(సీడ్‌బాల్స్) తయారి కార్యక్ర మం నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి మాట్లాడుతూ.. వివిధ రకాల విత్తనాలు సేకరించి విద్యార్థుల చేత విత్తన బంతులు( సీడ్ బాల్స్)తయారు చేయించి వాటిని పలు చోట్ల వెదజల్లి వివిధ రకాల మొక్కలను మొలకెత్తించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎర్ర మట్టి, కంపోస్ట్ స్థానిక మొక్కల జాతులైన చింత, కానుగ, వేప, కుంకుడు, గుల్మొహర్ విత్తనాలను ఉపయోగించి విత్తన బంతులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వృక్ష శాస్త్ర విభాగం అధిపతి డా.దేవెందర్ వీరమల్ల, వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మినరసింహం, అకడమిక్ కో ఆర్డినేటర్ డి.జనార్థన్ అధ్యాపకులు పాల్గొన్నారు.