పాత ఇంటి కర్రలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు
ఉట్నూర్, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పాత గుడిసెలను తొలగించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులు తమ పాత ఇంటి కర్రలను (టేకు సామాగ్రి)ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొంతమంది వాడుతూన్నారు.
ఐతే పాత టేకు కర్రలకు అటవీ శాఖ అధికారులు నిర్ణయించిన జరిమానాలు చెల్లిస్తు అనుమతి పత్రాన్ని పొందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కు వాడే టేకు కర్రను ముందస్తుగా అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకుంటే జరిమానాలు విధించే అవసరం ఉండదని అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నో ఏళ్ల నుండి పూరి గుడిసెల్లో ఉంటున్న ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అటవీ శాఖ అధికారులు నుండి ఎలాం టి అనుమతులు లేకుండా పాత కర్రలు ఉపయోగించడంతో జరిమాన చెల్లించవలసి వస్తుందని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఆ శాఖ అధికారులు కల్పిస్తున్న అవగాహన తో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ముందస్తు అనుమతి తీసుకుంటు న్నారని అధికారులు పేర్కొంటున్నారు.
అనుమతికి కావలసిన పత్రాలు...
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లించిన రసీదు తో పాటు పాత ఇంటిలో ఉన్న టేకు కర్రలను లెక్కించి గ్రామ పంచాయతీ నుండి ధ్రువీకరణ పత్రంతో పాటు వారి రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు పాత ఇంటి కర్రల ఫోటోలు జత చేసి అడవి శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలి.
లబ్ధిదారులు చేసిన దరఖాస్తులను అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, జిల్లా అటవీ శాఖ అధికారికి అనుమతి కోసం పంపిస్తారు. లబ్ధిదారులు సమర్పించిన పత్రము ను పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్లకు పాత కర్రను ఉపయోగించుటకు ఉత్తర్వులు జారీ చేస్తారు. డీఎఫ్‌ఓ జారీ చేసిన ఉత్తర్వులు మేరకు పాత టేకు కర్రను ఇందిరమ్మ ఇండ్లకు వినియోగించుకోవచ్చు.
దరఖాస్తు చేసిన వారికి అనుమతిస్తాం
ఇంద్రవెల్లి రేంజ్ పరిధిలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పాత కర్ర ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్లకు పాత కొర్రలు వినియోగించుటకు ఉన్నతాధికారుల అనుమతితో అనుమతి ఇస్తాం. అడవి శాఖ అనుమతి లేకుండా పాత కర్రను వినియోగించిన వారికి జరిమానులు విధించడం జరుగుతుంది. పాత కర్రలకు అనుమతి తీసుకుని ఉపయోగించుకుంటే లబ్ధిదా రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సంతోష్, ఎఫ్‌ఆర్‌ఓ, ఇంద్రవెల్లి రేంజ్




