28 May, 2026 | 6:58 PM

తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి

28-05-2026 05:44 PM

సుల్తానాబాద్ , మే 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన  వీరగోని బక్కయ్య (50) తాటి చెట్టు పై నుండి కింద పడడంతో మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం....  గురువారం బక్కయ్య  తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో  పై నుంచి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు  గమనించీ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  శరీరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర గాయాలు కావడంతో  108 అంబులెన్స్ ద్వారా కరీంనగర్ కు తరలించారు. ఆస్పత్రిలో  పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  ప్రభుత్వం గీత కార్మికుని కుటుంబాన్ని   ఆదుకోవాలని సర్పంచ్ ఓగుల పూజ , గీత కార్మిక సంఘం  అధ్యక్షులు పోన్నం పోచమల్లు ప్రభుత్వాన్ని  కోరారు...