సహజ కాన్పులపై గర్భిణీలకు అవగాహన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి 9: గర్భిణీలు సహజ కాన్పులకై క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ కోరారు. సోమవారం అర్వపల్లిలోని పీహెచ్సీలో సహజ కాన్పుల కొరకు గర్భిణీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సూచించిన విధంగా వ్యాయామం చేయాలని, సహజ కాన్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ఆపరేషన్ అయినట్లయితే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ బిచ్చునాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.




