పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి బీఆర్ఎస్ నాయకుల సంతాపం
ఇల్లందు, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ఇల్లందులో ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్. రంగనాథ్, శీలం రమేష్, అజ్మీర బాసింగ్ నాయక్, జాఫర్ హుస్సేన్, లలిత్ కుమార్ పాసి తదితర బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.






