వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు
03-08-2026 06:29 PM
తడ్కల్‌లో గడ్డి మందు పిచికారీ
కంగ్టి,(విజయక్రాంతి): వర్షాకాలంలో దోమలు, విషపురుగుల బెడదను నివారించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో గడ్డి మందు పిచికారీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సమీర్ ఆధ్వర్యంలో గ్రామంలోని రహదారుల పక్కన, ఖాళీ స్థలాలు, కలుపు మొక్కలు పెరిగిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా గడ్డి మందు పిచికారీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.






