4 August, 2026 | 8:26 PM

గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

03-08-2026 06:17 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): సీతారాంపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ కుంజా రవి తెలిపారు.సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సీతారాంపురం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అర్హులైన పింఛన్ లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ సున్నం దావీదు,వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు, పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.