3 August, 2026 | 7:31 PM

రఘునాథ గూడెంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

03-08-2026 06:36 PM

ముర్రుపాల ప్రాముఖ్యతపై అవగాహన

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని చంద్రుపట్ల,రఘునాథగూడెం గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు. చండ్రుపట్ల సెక్టార్ సూపర్వైజర్ సుజాత, రఘునాధ గూడెం సర్పంచ్ సుధారాణి రాణా మాట్లాడుతూ... పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని తెలిపారు.

ముర్రుపాలలో అధిక పోషక విలువలు ఉండి, బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, తల్లి, బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని వివరించారు. తల్లిపాలు శిశువును వివిధ వ్యాధుల నుండి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఆరు నెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని వారు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అదేవిధంగా చెన్నూరు గ్రామపంచాయతీ నందు సూపర్వైజర్ వెంకటమ్మ ఆధ్వర్యంలో కూడా తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి.