ఎక్కడ చూసినా ముందస్తు ఇసుక మొరం డంప్ లు
09-05-2026 03:45 PM
బోథ్,(విజయక్రాంతి): రానున్న వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకొని అక్రమ ఇసుక ,మొరం వ్యాపారులు ముందు చూపు తో ఇసుక మొరం డంప్ లు సిద్ధం చేసుకుంటున్నారు. బోత్ .సోనాల. మండలాలకు అర్ధరాత్రి అక్రమంగా జీరోలో ఇసుక చేరుతున్నది. మరోవైపు స్థానికంగా ఉన్న అడవుల్లో నుండి రాత్రిపూట మొరం తరలించి నిలువ ఉంచుతున్నారు. అదిలాబాద్ పెనుగంగ నుండి టిప్పర్లను నల్ల ఇసుకను తీసుకువచ్చి నిల్వ ఉంచుతున్నారు. ఇక కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గ్రామాల సమీపంలోని వాగుల నుండి నల్ల ఇసుకను తీసుకువచ్చి డంపు చేసి ఉంచుతున్నారు. అయితే స్థానిక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరల్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ ఈ వ్యాపారం అధికారులకు కనిపించడం లేదా అన్న విమర్శలు వస్తున్నాయి.






