సనత్ నగర్ బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు
సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమానికి వెళ్లకుండా ఈరోజు ఉదయాన్నే సనత్ నగర్ డివిజన్ లోని నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్ట్ లో బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, మాజీ డివిజన్ అధ్యక్షులు కన్నూరి క్రాంతికుమార్, డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, తైలం ప్రీతం,హరీష్, మురళీ కిషోర్, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.




