12 August, 2026 | 7:58 PM

తక్షణమే పీఆర్సీ ప్రకటించాలి

12-08-2026 06:22 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ యుఎస్పిసి ఆధ్వర్యంలో అపరిస్కృతంగా ఉన్నటువంటి విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై భాగంగా మండల తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి చేరే విధంగా మెమోరండం సమర్పించడం జరిగింది. 2023 జులైలో ప్రకటించాల్సిన పిఆర్సి ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేదని, 6 డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం ,సుప్రీంకోర్టు 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది.

సిపిఎస్ ను రద్దు చేయాలని, అదేవిధంగా డిఈఓ, డిప్యూటీఈ, ఎంఈఓ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, హెల్త్ కార్డులను సరైన గైడ్ లైన్ తో వెంటనే విడుదల చేయాలని తదితర డిమాండ్ల తో నాలుగు దశలుగా పోరాట కార్యక్రమాలను యుఎస్పిసి చేపట్టింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తాసిల్దారులకు USPC భాగస్వామ్య సంఘ నాయకులు చందుర్తి మండల తహసీల్దార్ కు మెమోరండం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వంగ తిరుపతి,మందాడి శ్రీనివాస్,ఎడ్ల కృష్ణ చైతన్య,గుండబోయిన ,శ్రీనివాస్ యాదవ్ ,తక్కెళ్ల లచ్చిరెడ్డి,అంబటి శంకర్,గుడిమల్ల సురేష్ ,బండ శంకర్ పాల్గొన్నారు.