12 August, 2026 | 9:15 PM

సెస్ వైస్ చైర్మన్‌ను పరామర్శించిన చల్మెడ

12-08-2026 07:43 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన జిల్లా సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి సోదరుడు దేవరకొండ మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మురళి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చల్మెడ వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, సీనియర్ నాయకులు మందాల శ్రీనివాస్, వంశీకృష్ణ, శివతేజ, రత్నకర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.