12 August, 2026 | 9:16 PM

ప్రజా సమస్యకు పరిష్కార బాటలు

12-08-2026 07:31 PM

తుప్పుపట్టిన ఇనుప విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త సిమెంట్‌ స్తంభాలు

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో ఏళ్లుగా ప్రమాదకరంగా మారిన పాత ఇనుప విద్యుత్‌ స్తంభాల సమస్యకు పరిష్కారం లభించింది. తుప్పుపట్టి ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన కలిగిస్తున్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఉపసర్పంచ్‌ గుండె వెంకన్న ప్రజల సమస్యను విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఏఈ వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని తక్షణమే మరమ్మతు పనులు చేపట్టారు.

ఎల్‌ఐ తోటమళ్ల సురేష్‌ ఆధ్వర్యంలో స్తంభాల మార్పిడి పనులు చేపట్టారు. దీంతో విద్యుత్‌ షాక్‌, వైర్లు తెగిపడటం వంటి ప్రమాదాల ముప్పు తగ్గనుందని అధికారులు తెలిపారు.ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను చొరవతో పరిష్కరించిన విద్యుత్‌ అధికారులకు, ఉపసర్పంచ్‌ గుండె వెంకన్నకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.