చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు
నాగల్‌గిద్ద,(విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలంలో చేయూత పెన్షన్ల కోసం అర్హులైన వారి నుంచి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు తదితర అర్హులు చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి చేయూత పెన్షన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.






