12 August, 2026 | 7:57 PM

ముస్తాబాద్ లో ఘనంగా తిరంగా ర్యాలీ

12-08-2026 06:26 PM

* ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర నాయకుడు కుమ్మరి శంకర్ 

* ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి 

* బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల  కేంద్రంలోని మంగళగడ్డ హనుమాన్ దేవాలయం నుండి వివేకానంద విగ్రహం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై ప్రధాన రహదారి వెంబడి జాతీయ జెండాలతో ర్యాలీ తీయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకుడు, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ హాజరయ్యారు.

ప్రతి ఇంటిపై  జాతీయ జెండా రేపరెపలాడాలని, వందేమాతరం గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు.బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోది పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రతి యువత దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, సంతోష్ రెడ్డి,జిల్లా కార్యదర్శి సంజీవ్,మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరి గోపి,మహేశ్వరి, ముస్తాబాద్,మొర్రాయిపల్లె,ఆవునూరు సర్పంచ్ లు వెంకటేశ్వర్ రెడ్డి,రవీందర్, శ్రీనివాస్,వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు కృష్ణ, రాజు,నవీన్,మండల ఉపాధ్యక్షులు,తిరుపతి, ప్రశాంత్,కార్యదర్శి మల్లేశం, జనార్దన్,శ్రీనివాస్ రావు,రమేష్ రెడ్డి, నరేష్,వెంకటేష్,వెంకన్న,కార్తీక్ రెడ్డి,రామ్ గోపాల్, మల్లారెడ్డి,వేణు గోపాల్, సునందా ,ప్రశాంత్ రెడ్డి, మహేష్,సత్తయ్య, ప్రశాంత్,వినయ్, అనిల్, శ్రావణ్, బాలరాజు,సత్యం, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.