calender_icon.png 6 February, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

05-02-2026 04:21:57 PM

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటలోని మర్రి చెట్టు వద్ద ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా పూలతో అలంకరించారు. ఉదయాన్నే గణపతి పూజ, సింధూరం, విశేష పూజల అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.