calender_icon.png 6 February, 2026 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు

05-02-2026 04:19:16 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పాల్గొన్నారు. మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులలో  అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మ వాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెం ప్రజలతో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరచిన  అభ్యర్థులను ఈ నెల 11 తేదీన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంథని పట్టణ ప్రజలు అభివృద్ధికి భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు కోరారు.  ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, అభ్యర్థులు ముసుకుల సురేందర్ రెడ్డి, శ్రీపది బానయ్య, దధితరులు పాల్గొన్నారు.