15 May, 2026 | 3:25 PM

Breaking News

ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •  

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించండి

17-11-2025 07:56 PM

వనపర్తి టౌన్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఒసి ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజావాణి సహ సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులు, ఇంచార్జి మంత్రి నుండి వచ్చే దరఖాస్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు. ప్రజావాణిలో స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సైతం పాల్గొని పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమానికి  అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.