16 August, 2026 | 8:31 PM

పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టివేత

16-08-2026 07:14 PM

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తొగిట బాలరాజు(49) మరియు మింగారబోయిన యేసు(33) ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెళ్లడైందని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.

ఆ ఇద్దరు వ్యక్తులు బూరుగుపల్లి నుండి పోచారం మీదుగా లింగంపేట వైపు అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ వాహనం టీఎస్ 35 టిఏ 2486లో 29 సంచుల పిడిఎస్ బియ్యం తరలిస్తుండగా మాల్తుమ్మెద గేటు సమీపంలోని ఎన్.హెచ్ 765డి రోడ్డుపై పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వాహనంలో మొత్తం 29 సంచులు సుమారు 14.5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి బియ్యంతో సహా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. నిందితుల వద్ద ఉన్న బియ్యం కొనుగోలు, విక్రయాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ ఎం.మదన్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు.