14 July, 2026 | 6:43 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

రెండు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం

11-10-2025 01:41 AM

మెదక్ ఏడీఈ మోహన్ బాబు

మెదక్, అక్టోబర్ 10:ప్రజలకు మరింత నాణ్యమైన, అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్లలో మరమ్మతులు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్, కరెంట్ తీగల మార్పులతో పాటు ట్రీ కటింగ్ తదితర పనులు చేపట్టనున్న దృష్ట్యా జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంతో పాటు మెదక్, హవేళీ ఘనపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల్లో శనివారం,

ఆదివారం రెండు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మెదక్ విద్యుత్తు శాఖ ఏడీఈ మోహన్‌బాబు, మెదక్ పట్టణ, హవేళీ ఘనపూర్ మండల ఏఈ నవీన్, మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాల ఏఈలు రాజ్‌కుమార్, దినకర్, నర్సింలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.