calender_icon.png 20 February, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్పర్సన్ వైస్ చైర్ పర్సన్ లను సన్మానించిన కుమ్మరి సంఘం

20-02-2026 07:19:49 PM

గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మ భాయ్ నర్సింగరావు, 16వ వార్డ్ కౌన్సిలర్ సత్యలక్ష్మి యాదగిరి లను గజ్వేల్ శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. గజ్వేల్ పట్టణంలోని ముత్యాలమ్మ పోచమ్మ ఆలయంలో పాలక వర్గం పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. అమ్మవార్ల దీవెనలతో మున్సిపల్ పాలకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేయాలని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు, మహిళలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.