22 March, 2026 | 3:23 AM

కేసీఆర్‌పై కేటీఆర్, హరీశ్‌రావుల రాజకీయ కుట్ర

22-03-2026 12:08 AM

ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్  

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కుమారు డు కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు రాజకీయ కుట్ర చేస్తు న్నారని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమా ర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం ఆ యన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను కావాలనే ఫామ్‌హౌస్‌లోనే ఉంచి బయటకు రానీయ డం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కీలక సమయంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉ న్నప్పటికీ, ఆయన గైర్హాజరు కావడం అనుమా నాలకు తావిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించిన సాయికుమార్, ఇది కేవలం కేటీఆర్, హరీశ్‌రావుల రాజకీయ ఎదుగుదల కోసం పన్నిన కుట్రేనన్నారు. 

సోమవారం నుంచి జరగనున్న బడ్జెట్‌పై చర్చల్లో కూడా కేసీఆర్ పా ల్గొనకపోతే, ఆయన ఆరోగ్యం, ఈ ఆరోపణలపై మరింత అనుమానాలు బలపడ తా యన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కు సందేహాలున్నాయని, వెంటనే హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్‌చేశారు.