6 August, 2026 | 1:20 AM

బెంగాల్ పనివారిలో రాజకీయ చైతన్యం!

06-08-2026 12:17 AM

గీతంలో కేంబ్రిడ్జ్ చరిత్రకారిణి ప్రొఫెసర్ సమీతా సేన్

పటాన్ చెరు, ఆగస్టు 5 (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్ లోని గృహ కార్మికులలో రాజకీయ చైతన్యం అభివృద్ధి చెందుతోందని, గుర్తింపు, గౌరవం, న్యాయపరమైన వేతనాలు, చట్టపరమైన రక్షణ వంటి డిమాండ్లతో సమీకృతమవుతున్నట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని చరిత్ర ఉపన్యాసకురాలు సమీతా సేన్ పేర్కొన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవి ద్యాలయం, సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ ఆధ్వర్యంలో పట్టణీకరణ, లింగం, శ్రమ (యూజీఎల్) విభాగం క్లస్టర్ ప్రారంభోపన్యాసాన్ని బుధవారం నిర్వహించింది.

పశ్చిమ బెంగాల్ లో గృహ కార్మికుల రాజకీయాలు అనే అంశంపై ఆమె ఆన్ లైన్ లో ఆతిథ్య ఉపన్యాసం చేశారు. పట్టణీకరణ, శ్రమ, లింగం వంటి అంశాలపై పనిచేస్తున్న స్కాలర్లను ఒకచోట చేర్చి, వివిధ రంగాల మధ్య అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహించే ఒక వేదికగా యూజీఎల్ డైలాగ్ ను రూపొందించారు. గృహాలలో పనిచేయడం అనేది  వలసలకు ముఖ్యమైన రంగంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.