6 August, 2026 | 2:30 AM

ట్రాఫిక్ సమస్యలపై జాయింట్ సీపీ పర్యటన

06-08-2026 01:18 AM

శేరిలింగంపల్లి,ఆగస్టు 5 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ బుధవారం ఐకియా జంక్షన్, ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ టర్న్ వద్ద క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు.ఐకియా జ ంక్షన్ వద్ద తనిఖీ సందర్భంగా మెట్రో, ఇతర ప్రజా రవాణా సాధనాల ద్వారా వచ్చే పాదచారులు నిర్దేశిత జెబ్రా క్రాసింగ్లు వినియో గించకుండా రహదారిని అడ్డంగా దాటుతు న్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. పాదచారుల భద్రతను దృష్టికి రావడంతో జెబ్రా క్రాసింగ్లు, నిర్దేశిత స్థలాల వద్దనే దాటాలని ప్రజల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అవసరమైన చోట్ల కఠినమైన అమలు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.తదనంతరం ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ టర్న్ వద్ద ట్రాఫిక్ ప్రవాహం, ప్రస్తుత మౌలిక సదుపాయాల స్థితిగతులను పరిశీలించారు. వాహనాలు సజావుగా కదలడాని కి, రద్దీని తగ్గించడానికి అవసరమైన ఇంజనీరింగ్ మెరుగుదలలు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అదే సమయంలో రహదారి పక్కన అనధికారంగా నిలిపి ఉన్న క్యాబ్లు ట్రాఫిక్కు అడ్డంకిగా మారుతున్నట్లు గమనించిన సీపీ, అన్ని అక్రమ పార్కింగ్ వాహనాలను వెంట నే తొలగించాలని ఆదేశించారు. అనధికార పార్కి్ంప ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రజా రహదారులను అడ్డంకులు లేకుండా ఉంచాలని సూచనలు చేశారు.