రంగారెడ్డి జిల్లాలో రాజకీయ చైతన్య యాత్ర
02-03-2026 12:32 AM
టీఆర్పీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అధ్వరంలో రాజకీయ చైతన్య యాత్ర చేపట్టారు. ఈ యాత్రను టీఆర్పీ వర్కింగ్ ప్రెసి డెంట్ సుదగాని హరిశంకర్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయ కుం డా మోసం చేస్తున్న క్రమంలో ప్రజలకు వివరించేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు టీఆర్పీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా, యువజన విభా గం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




