2 March, 2026 | 11:10 AM

మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

02-03-2026 12:31 AM

మిడ్జిల్, మార్చి 1:ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు-పడిగళ్ళ సురేష్ మాదిగ అధ్యక్షతనమండల కేంద్రంలో మాదిగ అమరవీరులకునివాళులర్పించి,జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మర్పిఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ సారధ్యంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం మూడు దశాబ్దాలు

పాటు కొనసాగిన సామాజిక ఉద్యమంలో జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు కన్నీటి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు గణేష్ మాదిగ ,అంబేద్కర్ సంఘం అధ్యక్షు లు బరిగెల దేవయ్య ,గుడ్ల బాలయ్య , బరిగెల బుచ్చయ్య,సుకుమార్,మహేష్,వార్డు సభ్యులు పర్వతాలు,గోపాల్ ,తిరుపతి, లక్ష్మణ్ పవర్,అంజనేయులు, పోషయ్య,  తదితరులు పాల్గొన్నారు.