30 August, 2026 | 8:36 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నాయకుల చేరిక

30-08-2026 07:40 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సాత్ నంబర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్ కాలనీలోని నరేష్ జాదవ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సాత్ నంబర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సాత్ నంబర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

వార్డ్ మెంబర్ పవార్ శివరామ్, జాదవ్ రమేష్, రాథోడ్ దుదిరామ్, రాథోడ్ దేవిదాస్, పవార్ మున్‌సింగ్, పవార్ రోహిదాస్, పవార్ శివకుమార్, జాదవ్ దిలీప్, పవార్ బలిరామ్, రాథోడ్ నిశాంత్, రాథోడ్ ధార్మిరామ్, పవార్ సునీల్, చౌహన్ రామ్‌దాస్, పవార్ శుశీల్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాత్ నంబర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు