30 August, 2026 | 8:19 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

యాదగిరిగుట్టలో భక్తురాలి పర్సు చోరీ

30-08-2026 07:16 PM

సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న ఎస్పిఎఫ్ సిబ్బంది

యాదగిరిగుట్ట, ఆగస్టు 30 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వచ్చారు. కొండపైని బస్టాండ్‌ సమీపంలో గల సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ కేంద్రం వద్ద ఆమె తన పర్సును(4200 రూపాయలు) పోగొట్టుకున్నారు.

​బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా, కొండపై భక్తులకు బొట్టు పెట్టే వ్యక్తులు ఆ పర్సును తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్‌పీఎఫ్‌  సిబ్బంది బస్టాండ్‌ పరిసరాల్లో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి పర్సును స్వాధీనం చేసుకుని, సీఎస్‌ఓ చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. ​పోగొట్టుకున్న పర్సు తిరిగి లభించడంతో ఆ భక్తురాలు హర్షం వ్యక్తం చేస్తూ, సత్వరమే స్పందించిన ఎస్‌పీఎఫ్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు