మన్ కీ బాత్ లో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు
30-08-2026 07:28 PM
గుడిహత్నూర్, (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలకించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందిస్తూ, సమాజ అభివృద్ధి, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






