10 July, 2026 | 8:08 PM

Breaking News

ఆరవ వార్డు కౌన్సిలర్ భాకం సాయి కిరణ్ ఔదార్యం   •   క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ   •   తెలంగాణ ఉద్యమం తరహాలో... డంపింగ్ యార్డ్ ఉద్యమం ఉధృతం చేస్తాం   •   12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •  

జాకోర, చందూర్ ఎత్తిపోతల పంపు మోటార్ల ట్రయల్ రన్ చేసిన పోచారం

11-04-2026 02:18 AM

బాన్సువాడ, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలో నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియా 10 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి 106 కోట్లతో నిర్మించి త్వరలో ప్రారంభించనున్న వర్ని మండలం జాకొర,చందూర్ ఎత్తిపోతల పథకాల పంపు మోటార్ల ట్రయల్ రన్ ను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు.

సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారులు పెంటారెడ్డి గారు, ఇరిగేషన్ CE శ్రీనివాస్ వర్ని,చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇరిగేషన్ అధికారులు,రైతులు పాల్గొన్నారు.