12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. గట్టయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు అండర్-14, అండర్-16, అండర్-18, అండర్-20 బాలబాలికలు, అలాగే పురుషులు, మహిళలు విభాగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.వయో విభాగాలను అనుసరించి 600 మీటర్లు, 800 మీటర్లు, 1000 మీటర్లు, 1500 మీటర్లు, 2 కి.మీ., 3 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరుగులు, ట్రయాథ్లాన్ (ఏ, బీ, సీ) విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.పోటీల్లో పాల్గొనదలిచిన క్రీడాకారులు వయస్సు నిర్ధారణ పత్రాలతో హాజరుకావాలని, ప్రతి ఈవెంట్‌కు రూ.100 ప్రవేశ రుసుము చెల్లించాలని నిర్వాహకులు సూచించారు. పూర్తి వివరాలకు 9618336976 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.






