10 July, 2026 | 9:01 PM

సర్ సవరణ 15 లోపే సంపూర్ణం అవ్వాలి

10-07-2026 08:04 PM

- కోహెడ తహసీల్దార్ నవీన్ కుమార్ క్షేత్ర పరిశీలన

కోహెడ: కోహెడ మండలంలో కొనసాగుతున్న సర్ సవరణ పక్రియ ఈ నెల 15 లోపే పూర్తి కావాలని.. తహసీల్దార్ నవీన్ కుమార్ బీఎల్ఓలను ఆదేశించారు. శుక్రవారం కోహెడ లో 96, 97, 98 బీఎల్ఓ లలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 38598 ఉన్నారని వారందరికీ కూడా ఎనుమురేషన్ ఫామ్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికి సుమారుగా 16 వేల వరకు ఫామ్స్ ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. సర్ ప్రక్రియ ఈ నెల 15 వరకు చివరి రోజు కావడంతో గ్రామాలలో బీఎల్ఓలతో యువత, విద్యావంతులు భాగస్వాములై వంద శాతం నిర్ణీత సమయంలోగా పూర్తి చేయుటకు కృషి చేయాలని తహసీల్దార్ కోరారు. కార్యక్రమంలో కోహెడ జీపీ సభ్యులు గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్, కట్ట ప్రవీణ్ పాల్గొన్నారు.