10 July, 2026 | 9:01 PM

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

10-07-2026 08:02 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో క్షయ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రినీ శుక్రవారం సందర్శించారు. డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ రవికుమార్ తో కలిసి క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకారాకి కిట్లను అందజేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఐదుగురు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని ఆరు నెలల పాటు పోస్టుకాహార కిట్టులను అందజేయడానికి ముందుకొచ్చారు.  ఇందులో భాగంగా బెల్లంపల్లి పరిధిలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికార కిట్టులను అందజేయడం అదేవిధంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల పైన వైద్య సంచాలకులు డాక్టర్ రవితో కలిసి సమీక్ష చేశారు.

ముఖ్యంగా ఆసుపత్రిలో ప్రసవాలు అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ చికిత్సలు క్షయ వ్యాధిగ్రస్తుల నిర్ధారణ చికిత్సలు అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు రక్త నమూనాల పంపిణీ పరీక్షల వివరములను అసంక్రమణ వ్యాధులు 30 సంవత్సరముల పైబడిన వారందరికీ పరీక్షల వివరాలను నమోదు, అత్యవసర మందులు పాము కాటు కుక్కకాటు వ్యాక్సినేషన్ ఉంచుకొనడం ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచడం చిన్నపిల్ల నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యల పైన అందిస్తున్న వైద్య సేవల పైన డాక్టర్ మూర్తి పిల్లల వైద్య నిపుణులతో మాట్లాడి తగు సూచనలు ఆదేశాలు ఇచ్చారు.

అదేవిధంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించునున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వైద్యులు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు  సమన్వయంతో పిల్లలకు ఒకటి నుండి 19 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తినిపించాలని ఆదేశించచారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్ సి హెచ్ ఓ శ్రీ నాందేవ్ సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ క్షయ వ్యాధి సిబ్బంది, ఆస్పత్రికి వైద్య సిబ్బంది నర్సింగ్ అధికారులు ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది,మురళి ఆశ ఆరోగ్య కార్యకర్తలు క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.