11 April, 2026 | 4:11 AM

జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతలుగా మహేష్, రాగుల రమ్య

11-04-2026 02:17 AM

గజ్వేల్, ఏప్రిల్10: సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్కు చెందిన న్యాయ నిర్ణేతలు చిల్లీ మహేష్, రాగుల రమ్య జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మహిళా, పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో రెఫారీలుగా సేవలందిస్తూ అనుభవాన్ని సంపాదించారు. వారి ప్రతిభను గుర్తించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, ప్రతి సంవత్సరం వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తూ ప్రోత్సహించింది.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి రెఫరీ పరీక్షకు మద్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో వీరిని పంపించారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులై జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతలుగా అర్హత సాధించడం విశేషం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అధ్యక్షులు ఎన్.సి. సంతోష్ కుమార్, జాయింట్ సెక్రటరీ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ళ శివ కుమార్తో పాటు కార్యవర్గ సభ్యులు చిల్లీ మహేష్, రాగుల రమ్యాలను అభినందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.