22 July, 2026 | 2:43 AM

నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు

22-07-2026 02:02 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

వేములవాడ, జులై 21, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పోచమ్మ అ మ్మవారికి బోనాలు సమర్పించిన ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

బో నాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. రాజ న్న క్షేత్రంతో పాటు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉం డాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కులవృత్తులు, స్థానిక సంఘాలకు ప్ర భుత్వం అండగా ఉంటుందని, నాయి బ్రా హ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతిని ధులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.