24 August, 2026 | 3:32 AM

కన్నుల పండువగా పోచమ్మ బోనాలు

24-08-2026 12:51 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23 (విజయక్రాంతి):ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, శేరిగూడ తదితర ప్రాంతాల్లో పోచమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ మహిళలు అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయాలకు తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పురవీధులన్నీ ఆధ్యాత్మికత తో విలసిల్లాయి.