27 July, 2026 | 12:28 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు సహకరించాలి

18-05-2026 05:57 PM

కోనరావుపేట మండల మెడికల్ షాప్ అసోసియేషన్ విజ్ఞప్తి.

కోనరావుపేట, మే 18(విజయక్రాంతి): అల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు ప్రజలు సహకరించాలని కోనరావుపేట మండల మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కోరారు.మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు సమావేశమై బంద్‌కు మద్దతు ప్రకటించారు. మూడు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఒక్కరోజు పాటు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డికి, ఎంపీడీవో స్నిగ్ద మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గంగాధర్, సమ్మయ్య, దామోదర్, లక్ష్మీరాజం, మధుకర్ రెడ్డి, రాములు, లక్ష్మీకాంతం, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.