18 May, 2026 | 7:03 PM

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలి

18-05-2026 05:58 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): రైతులు ఎక్కువసేపు కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాలలో రైతుల నుంచి వరి సేకరణ, తూకం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలకు అదనపు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వరిని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులు లేదా గోదాములకు తరలించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు ఎక్కువసేపు కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, వేగవంతంగా వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలన్నారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు