శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి
14-07-2026 12:05 AM
చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు
ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎల్. మధుబాబు అన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పద వి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సం చరించినట్లు అనుమానం వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. పోలీసుల విధులకు ఆటకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.






