20 August, 2026 | 2:45 AM

ముఠాపూర్‌లో ప్లాస్టిక్ నిషేధం

20-08-2026 01:05 AM

నిర్మల్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణాన్నికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ ను వాడం.. ప్రాణానికి హాని కానివ్వం.. అంటూ నిర్మల్ రూరల్ మండలంలోని మూటపూర్ గ్రామంలో ప్లాస్టిక్ ని నిషేధిస్తూ బుధవారం గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ మాన్పూరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎల్పీవో లింగయ్య, ఎంపీడీవో సుధాకర్ గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.

చెత్తబుట్టలు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ ను వినియోగిస్తే జరినామా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామపంచాయతీలో సర్పం చ్ మాన్పూరి రమేష్ వినూత్నంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, పంచాయతీ కార్యదర్శి చంద్రభూషణ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.