షావుకారు జానకి మరణవార్త ఎంతో బాధ కలిగించింది: NTR
21-08-2026 03:47 PM
ప్రముఖ నటి షావుకారు జానకి(Veteran Actress Sowcar Janaki Passes Away) 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని జూనియర్ ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) పేర్కొన్నారు. షావుకారు జానకి భారత సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. జానకి సినీ ప్రయాణం.. ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ప్రార్థించారు. జానకి కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు.






