21 August, 2026 | 4:57 PM

అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి

21-08-2026 03:45 PM

కొండపాక, ఆగస్టు 21 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొండపాక మండలంలోని కొండపాక, దుద్దెడ, వెలికట్ట తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్‌లు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కొండపాక సర్పంచ్ మంచాల నవీన, దుద్దెడ సర్పంచ్ మిద్దె శివకుమార్, వెలికట్ట సర్పంచ్ బూర్గుల మానస సురేందర్‌రావు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అవినీతికి తావులేకుండా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.